మహిళలకు ఉపశమనం.. ఇకపై నిలబడే మూత్రం పోయొచ్చు

సాంకేతికత రోజురోజుకు పెరిగిపోతుంది. మనిషిని ఇబ్బందిపెట్టే ఏ అంశానికైనా సాంకేతికతతో సమాధానం చెబుతున్నారు నిపుణులు. ఈ కోవలోకే అనేక ఆవిష్కరణలు వస్తాయి. ఇటీవల వరల్డ్ టాయిలెట్ డే సందర్బంగా మహిళలకు సంబంధించిన ఒక పరికరం అయింది. మోకాళ్ల ఆపరేషన్‌ చేయించుకున్న వాళ్లు, గర్భిణిలు, దివ్యాంగులు ఇతర సమస్యలతో మూత్ర విసర్జన సమయంలో ఇబ్బందిపడే మహిళలకు ఉపశమనం కలిగించేలా కొందరు ఐఐటీ విద్యార్థినులు కొత్త పరికరాన్ని ఆవిష్కరించారు. ఈ పరికరం సాయంతో మహిళలు నిలబడి మూత్రవిసర్జన చేయొచ్చని ఆ విద్యార్థినులు చెప్పారు.Telugu News IIT students invented a new device shanfi with which women can urinate by standing ఆ పరికరానికి ‘శాన్ఫి’ అని పేరు పెట్టారు. కేవలం పది రూపాయల ఖరీదు ఉండే ఈ పరికరాన్ని ఇప్పటికే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పరీక్షించారు. ‘వరల్డ్‌ టాయిలెట్‌ డే’ సందర్భంగా సోమవారం దీనిని విడుదల చేశారు. భూమిలో త్వరగానే కలసిపోయే ఈ పరికరాలతో పర్యావరణానికి కూడా హాని కలిగించదని వారు చెబుతున్నారు. మొదటగా పైలట్ ప్రాజెక్ట్ లాగా లక్ష వరకూ దేశవ్యాప్తంగా పంచారు. త్వరలోనే భారీ స్థాయిలో విపణిలోకి తీసుకొని వస్తామని వెల్లడించారు.