ఐకియా స్టోర్‌ కొసరు.. పోర్న్ క్లిప్ ప్రదర్శన

పొరపాట్లు మానవ సహజం మాత్రమే కాదు.., టీవీలు, ఫోన్లు, ఇతర పరికరాలకు కూడా సహజం. మనం ఒకటి తలచుకుంటే అవి మరొకటి తలచుకుని కలకలం రేపుతాయి. అలాంటి ఓ సాంకేతిక లోపం వల్ల ఐకియా స్టోర్‌కు వెళ్లిన జనం సిగ్గుతో కళ్లుమూసుకున్నారు. అక్కడ ప్రదర్శిస్తున్న టీవీ స్క్రీన్‌లో పోర్న్ క్లిప్ ప్రసారమైపోయింది మరి. హాంకాంగ్‌లో ఈ చిత్రం చోటుచేసుకుంది.

దుకాణంలోని టెక్నికల్ వ్యవస్థలో పొరపాటువల్ల ఈ క్లిప్ తెరపై వచ్చేయడంతో కస్టమర్లు టక్కున బయటికి చెక్కేశారు. అక్కడ పనిచేస్తున్న ఓ ఉద్యోగిని వెంటనే అశ్లీల నివారణ కోసం కొన్ని పేపర్ షీట్లు తీసుకొచ్చి స్క్రీన్‌పై కప్పేసింది. పేపర్లు కప్పే బదులు, పోర్న్ క్లిప్ ఆపొచ్చన్న ఆలోచన రాలేదో, లేకపోతే దాన్ని ఆపాలంటే చాలా సమయం పడుతుందన్న ఆత్రుతతోనో ఆమె చేసిన పని నెటిజన్లకు నవ్వు పుట్టిస్తోంది. మొత్తానికి కాసేపటి తర్వాత టీవీ ప్లగ్గును పీకేయడంతో బూతు తుపాను వెలిసింది. పోర్న్ వీడియో సంగతేమోగాని, అది ప్లే అవుతుండగా రికార్డయిన సీన్ మాత్రం సోషల్ మీడియాలో వైరలై కూర్చుంది. ఇదిలా ఉంటే చైనాలోని జియాంజౌ నగరంలో నడిరోడ్డుపై బిగించిన వాణిజ్య ప్రకటనలపై స్క్రీన్‌పై ఏకంగా 90 నిమిషాల పాటు పోర్న్ మూవీ ప్రసారమైంది. Telugu news ikea store romance clip played in hongkong shopping mall