ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలవడానికి వెళ్లిన వందలాది ikp అకౌంటెంట్స్ మరియు కంప్యూటర్ ఆపరేటర్లను మీడియాకు తెలియకుండా, గుట్టు చప్పుడు కాకుండా అరెస్ట్ చేసారు. గోషామహల్ స్టేడియంలో బంధించారు. సమస్యలు తీర్చే ముఖ్యమంత్రి దగ్గరకు కలవడానికి వెళ్ళడం పాపమన్నట్టు పోలీసులు అరెస్ట్ చెయ్యటం సబబు కాదని అంటున్నారు ఐకెపీ సభ్యులు.
వాళ్ళలో చాలా మంది మహిళలు ఉన్నారు. ఆడవాళ్ళు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోలీసులు ఇలా వ్యవహరించడం వికృత చర్యకు పరాకాష్ట అని వాళ్ళు అభిప్రాయ పడుతున్నారు. వారికి తాగడానికి మంచినీరు కూడ దొరకడం లేదట. వాళ్లేదో దొంగతనం చేసినట్టు వారిని ఎక్కడికి కదలనీయకుండా బంధించిన పోలీసుల తీరుపై పలువురు మండిపడుతున్నారు.