అక్రమ సంబంధం.. కానిస్టేబుల్ ఆత్మహత్య.. - MicTv.in - Telugu News
mictv telugu

అక్రమ సంబంధం.. కానిస్టేబుల్ ఆత్మహత్య..

February 6, 2018

అక్రమ సంబంధాలు అంతానికే దారి తీస్తాయనడానికి ఈ తాజా ఘటనే అందుకు ఉదాహరణ. మౌలాలీలో సందీప్ కుమార్ ( 28 ) అనే కానిస్టేబుల్ రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. లాలాపేట్ ఇందిరా నగర్‌కు చెందిన సందీప్ కుమార్ మొఘల్ పురాలోని పోలీస్ స్టేషన్‌లో విధుల నిర్వహిస్తున్నాడు. అతడికి కొన్ని రోజుల క్రితం ఫేస్‌బుక్ ద్వారా ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.

వివాహిత భర్త..  సందీప్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇతని వ్యవహారంపై మీడియాలో కథనాలు, మరోవైపు శాఖాపరమైన చర్యల తీసుకోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. సందీప్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.