కర్ణాటకతో లవ్‌లో పడిన  అర్జున్ రెడ్డి! - MicTv.in - Telugu News
mictv telugu

కర్ణాటకతో లవ్‌లో పడిన  అర్జున్ రెడ్డి!

December 5, 2017

‘కర్ణాటక రాష్ట్రం నుండి గొప్ప గొప్ప క్రికెటర్లు, సినిమా స్టార్లు వచ్చారు. సూపర్‌స్టార్ రజినీ కాంత్, ఐశ్వర్యారాయ్, అనుష్కా శెట్టి వంటి మహామహులను అందించిన రాష్ట్రం కర్ణాటక.. ఐ లవ్ కర్ణాటక ’ అని యువ హీరో,  విజయ్ దేవరకొండ అలియాస్ అర్జున్ రెడ్డి  అన్నారు. ప్రముఖ కన్నడ నటుడు గణేష్ నటించిన ‘ చమక్ ’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ పై విధంగా స్పందించారు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘ఏ మంత్రం వేశావే ’ చిత్రంలో తన సరసన నటిస్తున్న రష్మిక మందన..  చమక్ సినిమాలో కథానాయికగా నటిస్తున్నది. ఆమె ఆహ్వానం మేరకు విజయ్ చమక్ ఆడియో ఫంక్షన్‌కు వెళ్ళాడు.

 ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ.. ‘ హీరోగా నా తొలి చిత్రం పెళ్లిచూపులు 100 రోజులు ఆడింది. గోల్డెన్ స్టార్ గణష్  గురించి ఓసారి గూగుల్‌లో సెర్చ్ చేశాను. ఆయన నటించిన చిత్రం 800 రోజులు ఆడిందని తెలిసి ఆశ్చర్యపోయాను ’ అంటూ గణేష్ హీరోయిజాన్ని కొనియాడారు. తన మాటలను కొనసాగిస్తూ..

‘ జవగళ్‌ శ్రీనాథ్‌, రాహుల్‌ ద్రావిడ్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌, అనిల్‌ కుంబ్లే వంటి క్రికెటర్లను మనందరికీ అందించిన  కర్ణాటక అంటే చాలా ఇష్టం. ఎందుకంటే 40 శాతం భారత క్రికెటర్లు ఈ రాష్ట్రానికి చెందినవారే ఉన్నారు. రజనీకాంత్‌, ఐశ్వర్య రాయ్‌, అనుష్కా శెట్టి కూడా ఇదే రాష్ట్రానికి చెందినవారు. ఆ కోవలో ఇప్పుడు రష్మిక మందన వస్తున్నది. ఇప్పుడొస్తున్న కన్నడ చిత్రాల్లో కంటెంట్ చాలా బలంగా వుంటోంది. ఈమధ్యే శివరాజ్ కుమార్ నటించిన ‘ మఫ్టీ ’ చిత్రం ట్రైలర్ చూశాక నాకు అలాంటి గ్యాంగ్‌స్టర్ చిత్రంలో నటించాలని ఆసక్తి ఏర్పడింది ’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు విజయ్.