అందుకు టైం లేదు.. ప్రజాసేవకే అంకితం: పవన్ - MicTv.in - Telugu News
mictv telugu

అందుకు టైం లేదు.. ప్రజాసేవకే అంకితం: పవన్

November 20, 2018

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారు, ఏపీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో ఓ సినిమా చేయబోతున్నారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. ముగ్గురు ప్రముఖ దర్శకుల్లో ఎవరో ఒకరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని పుకార్లు వచ్చాయి. రాజకీయ నేపథ్యం కలిగిన సినిమాలోనే నటిస్తున్నట్టు వార్తలు షికారు చేశాయి. దీంతో  పవన్ ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ తాను సినిమా చెయ్యట్లేదని పవన్ వివరణ ఇచ్చారు. తన జీవితం ప్రజాసేవకే అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు.

‘నేను త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్టు కొన్ని మాధ్యమాల్లో వచ్చిన వార్తలు నిజం కాదు. ఏ చిత్రంలోనూ నటించడానికి అంగీకరించలేదు. సినిమాల్లో నటించేందుకు అవసరమైన సమయం లేదు. ప్రజా జీవితానికే పూర్తి సమయాన్ని కేటాయించాను. ప్రజల్లోనే వుంటూ జనసైనికులు, అభిమానులతో కలిసి పాలకుల తప్పిదాలను బలంగా వినిపిస్తున్న తరుణమిది. సినిమాలపై దృష్టి సారించడంలేదు. నా ఆలోచనలన్నీ ప్రజాక్షేమం కోసమే, నా తపనంతా సమసమాజ స్థాపన కోసమే’ అని తనదైన శైలిలో స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు పవన్ కల్యాణ్. పవన్ ఫ్యాన్స్‌కు ఈ వార్త కాస్త మింగుడుపడనిదే. అయినా పవన్ చాలా మంచి నిర్ణయం మీద నిలబడి వున్నారని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Telugu news I’m not cinema … my life is dedicated to public service … Pawan kalyan