నేను  మంచోడిని కాదు.. జాగ్ర‌త్త‌! - MicTv.in - Telugu News
mictv telugu

నేను  మంచోడిని కాదు.. జాగ్ర‌త్త‌!

December 7, 2017

నేను  మా అన్న చిరంజీవి అంతటి మంచోడిన కాను. దయచేసి మీరందరూ గుర్తు పెట్టుకోండి. చిరంజీవికి  చాలా సహనం వుంది పడతారు. నేనలా కాదు ’ అంటూ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. రాజ మహేంద్రవరం పర్యటనలో వున్న పవన్ కల్యాణ్, తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.

‘ప్రజలకు మోసం జరుగుతున్నప్పుడు పడే వ్యక్తిత్వం నాది అస్సలు కాదు. వ్యక్తిగతంగా నన్ను దెబ్బ కొట్టాలని చూస్తే వూరుకుంటాను. కానీ ప్రజల కోసం ముందుకొచ్చిన నన్ను దెబ్బ తీయాలని చూస్తే అస్సలు సహించను. జ‌న‌సేన‌లోకి వ‌స్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతామనుకున్నవాళ్ళెవరూ రావ‌ద్దు. . ప్ర‌జా సేవ‌కోస‌మ‌యితేనే రండి. పార్టీలో నాకు కొంద‌రు ఎక్కువ‌, త‌క్కువ అని ఉండదు.

ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెర‌వేర్చ‌నినాడు, నేను ప్ర‌జ‌ల త‌ర‌ఫున వ‌చ్చి పోరాడ‌తాను. నేను రెండు మాట‌లు మాట్లాడ‌ను మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు ఒకే విధంగా మాట్లాడ‌తాను ’ అని పేర్కొన్నారు.

అలాగే రాష్ట్ర విభజన గురించి స్పందిస్తూ..  ‘ మన దగ్గర రాష్ట్ర విభజన అంశం చల్లగానే తెగింది. అదే ఆఫ్రికా లాంటి దేశాల్లో జరిగుంటే తలకాయలు నరికేసుకొని నానా భీభత్సం సృష్ఠించేవారు.కానీ మన దగ్గర అలా జరగకపోవడానికి కారణం మన దేశంలో ధర్మం, సత్యం యొక్క శక్తియే. గొప్ప ఔన్నత్యం, సంస్కారం గల మన దేశ వ్యవస్థకు ఎవరూ తూట్లు పొడవలేరని ’ అన్నారు.

అలాగే కాపులకు బీసీలు వ్యతిరేకమని ఎందుకనుకుంటారని ప్రశ్నించారు. నాపై విమర్శలు చేసేటప్పుడు కాస్త ఆలోచించి చేయండి అన్నారు.