ఆకట్టుకుంటున్న జురాసిక్ పార్క్ ట్రైలర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆకట్టుకుంటున్న జురాసిక్ పార్క్ ట్రైలర్

December 8, 2017

జరాసిక్ పార్క్ ’ సినిమా అంటే ఎవరికి ఇష్టం వుండదు చెప్పండి. తాజాగా ఆ పరంపరలో 5వ సిరీస్‌గా వస్తున్న ‘ జురాసిక్ పార్క్ – ఫాలెన్ కింగ్‌డమ్ ’ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో విశేష ఆదరణ లభిస్తున్నది. యూనివర్సల్ పిక్చర్స్ పతాకంపై జె. ఏ. బయోనా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జూన్ 22 2018 కి విడుదలకు సిద్ధమవుతున్నది.

1993 లో స్టీఫెన్ స్పీల్‌బర్గ్ తీసిన జురాసిక్ పార్క్ అప్పట్లో ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత 1997లో కూడా మళ్ళీ స్టీఫెన్ స్పీల్ బర్గే దాని సీక్వెల్ తీసి హిట్టు కొట్టాడు. అటుపై 2001, 2015 లో వచ్చిన జురాసిక్ పార్క్ చిత్రాలు మంచి విజయాలను చవిచూసినవే. సిరీస్ అదే అయినా స్టీఫెన్ తొలి రెండు చిత్రాలకు దర్శకుడు ఆయనే.

ఆ తరువాత వచ్చిన సినిమాలకు దర్శకులు మారారు. తాజాగా వస్తున్న సినిమాను కూడా దర్శకుడు మారాడు.  బయోనా అనే ఈ దర్శకుడు చాలా చక్కగా సినిమాను తెరకెక్కించాడంటున్నారు. రాక్షస బల్లులకు, మనుషులకు మధ్య రసవత్తరమైన పోరాట దృశ్యాలతో సినిమా ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. ఆ కోవలోనే వస్తున్న ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా చక్కటి ప్రేక్షకాదరణ పొందుతుందనే అంచనాలున్నాయి.