ఏ దేశంలోనూ కళాకారుల తలలు నరుకుతామని అనరు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏ దేశంలోనూ కళాకారుల తలలు నరుకుతామని అనరు..

December 8, 2017

‘ కళాకారుల తలలు నరికితే నజరానాలు ఇస్తామని ప్రజా ప్రతినిధులే అనడం సిగ్గూచేటు.. అసలు మనం ప్రజాస్వామ్యంలోనే వున్నామా ? పద్మావతి సినిమా మీద ఎందుకింతగా కక్ష్యగట్టారో అర్థంకావటంలేదు..’ అంటూ ముంబయి హైకోర్ట్ ఘాటుగా స్పందించింది. పద్మావతి సినిమా మీద రాజకీయ దూమారం చెలరేగిన విషయం విదితమే. కాగా ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది.

ఈ చిత్రంపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో బాంబే హైకోర్టు న్యాయమూర్తులు ధర్మాధికారి, భారతి డాంగ్రేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘ ఏ దేశంలో కూడా ఇంత దారుణంగా కళాకారుల తలలు నరికేస్తామని బెదిరింపులకు దిగకపోవచ్చు. పాపం వాళ్ళు ఎంతో కష్టపడి సినిమా తీస్తే ఇలా అడ్డుకోవడం వల్ల వాళ్ళకెంత నష్టమో ఒక్కసారి ఆలోచించాలి. ఈ సినిమా  విషయంలో మనం ఎంత దిగజారిపోతున్నామో తెలిసిపోతున్నది.

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వారితో సమానంగా ఆందోళనలు చేస్తూ సినిమాను నిషేధించారు. ఇది మరో రకమైన సెన్సార్‌షిప్‌. పేరు, డబ్బున్నవారికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక పేదవాళ్ళ పరిస్థితి ఎలా వుండబోతోందో తెలిసిపోతోంది ’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్ట్. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై పలు రాష్ట్రాల్లో నిషేదం విధించిన విషయం విదితమే. ఇటీవల భన్సాలీ పార్లమెంట్ ప్యానెల్‌తో చర్చలు జరిపారు. ఇదిలా వుండగా ఫిబ్రవరి 2018లో సినిమా విడుదల అవుతుందంటున్నారు పద్మావతి చిత్ర యూనిట్ సభ్యులు.