తెలుగు ప్రజలపై జైట్లీ అనుచిత వ్యాఖ్యలు.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు ప్రజలపై జైట్లీ అనుచిత వ్యాఖ్యలు..

March 8, 2018

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలపై కేంద్ర ఆర్థికమంత్రి అక్కసు వెళ్లగక్కారు. తెలుగువాళ్ళందరూ  కట్టల కట్టల నోట్లను ఇళ్ళల్లో, లాకర్లలో దాచుకోవటం వల్లే ఏటీఎంలలో నోట్ల కొరత ఏర్పడిందని అన్నారు. బుధవారం విలేకర్ల సమావేశంలో ఈ పనికిమాలిన  ఆరోపణ చేశారు. సమావేశానికి తెలంగాణ బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి పుష్పలీల కూడా వచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డబ్బుల్లేవు. ఏ ఏటీఎంకు వెళ్లినా ప్రజలకు ఏటీఎంల నుంచి డబ్బులు రావటం లేదు. ఈ సమస్యకు మీరు పరిష్కారం చూపాలి ’ అని కోరారు.మంత్రి స్పందిస్తూ.. తాము రెండు రాష్ట్రాలకు విడుదల చేయాల్సిన దానికన్నా ఎక్కువ కరెన్సీనే విడుదల చేశమని ఘాటుగా సమాధానం చెప్పారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లోని డబ్బంతా ఇళ్ళల్లో, లాకర్లలో వుండటం వల్లే కొరత ఏర్పడిందని అన్నారు.