mictv telugu

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 17 మంది మృతి

February 12, 2019

దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో ఉన్న అర్పితా ప్యాలెస్ అనే హోటల్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు అందరూ గాఢనిద్రలో ఉండగా ఈ ప్రమాదం సంభవించడంతో భారీ ప్రాణనష్టం జరిగింది. హోటల్ గదుల్లో నిద్రిస్తున్న కొందరు బాల్కనీ నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసారు. ప్రమాదం జరగడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. హోటల్‌లోని ఎక్కువ గదులను పెళ్లి బృందం అద్దెకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

Telugu News In Delhi Hotel Fire That Killed 17 Wooden Panel In Corridors Were Deadly.

ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లోని 65 గదుల్లో దాదాపు 150 మంది వరకు ఉన్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక శిశువు కూడా ఉన్నారు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో ఒక మహిళ తన బిడ్డతో కలిసి కిటికీ లోంచి దూకడంతో వీరిద్దరూ మృతిచెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 35 మందిని సహాయక సిబ్బంది రక్షించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి 26 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తొక్కిసలాట కారణంగానే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు.Telugu News In Delhi Hotel Fire That Killed 17 Wooden Panel In Corridors Were Deadly