mictv telugu

మోదీకి ట్రంప్ ఫోన్… బంధం బలోపేతం

January 8, 2019

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై ట్రంప్ సుంకాలను పెంచిన తరువాత, రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్న విషయం తెలిసిందే. జనవరిలోగా పెంచిన సుంకాలను తగ్గించకుంటే తామూ ప్రతీకార సుంకాలను వేస్తామని భారత్ హెచ్చరించింది. దీంతో రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ మోదీకి ఫోన్ చేయడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ నిర్ధారించింది. వాణిజ్యలోటు తగ్గించడం, ఆఫ్గనిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితి తదితర అంశాలపై ఇరు నేతలు చర్చించినట్టు తెలిపింది.‘నూతన సంవత్సరంలో ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక బంధం మరింత బలోపేతం కానుంది. ఇండియా, యూఎస్ మధ్య ఉన్న వాణిజ్యలోటును తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన వారిద్దరు చర్చలు జరిపారు.శాంతి, ఆఫ్గన్‌కు సహకారం,  ఇండో – పసిఫిక్ రీజియన్‌లో తదితర అంశాలపైనా ట్రంప్, మోదీ చర్చించారు’ అని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది.