అజ్ఞాతవాసిలో కొలవెరి కుర్రాడు ఆడిపాడాడు - MicTv.in - Telugu News
mictv telugu

అజ్ఞాతవాసిలో కొలవెరి కుర్రాడు ఆడిపాడాడు

December 13, 2017

ఆదిత్య మ్యూజిక్ ద్వారా అజ్ఞాతవాసి పాట విడుదలైంది. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే ఈ పాటలో సంగీత దర్శకుడు అనిరుధ్ ఆడిపాడటం. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ‘ గాలి వాలుగా ’ చరణంతో సాగే ఈ పాటలో కొలవెరి కుర్రాడు తళుక్కున మెరిసాడు.

అతను రాక్‌స్టార్ మాదిరి పాట పాడుతుంటే అతని వెనకాల పవన్ కల్యాణ్ చిత్ర పటాలు వెళ్తుంటాయి. కాలర్ ట్యూన్‌గా అప్పుడే చాలా మంది ఫోన్లలోకి ఈ పాట చేరిపోవటం విశేషం. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానరుపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.