మసీదు కావాలో, మందిరం కావాలో తేల్చుకోండి! - MicTv.in - Telugu News
mictv telugu

మసీదు కావాలో, మందిరం కావాలో తేల్చుకోండి!

December 9, 2017

రామ మందిరం కావాలో.. బాబ్రీ మసీదు కావాలో తేల్చుకో ’ అంటూ ప్రధాని మోడీ కాంగ్రెస్‌కు సూటి ప్రశ్న వేశారు. గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలకు ముందు ప్రధాని బనస్కాంతలోని బాబర్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడారు.  రామజన్మభూమికి, 2019 ఎన్నికల కేసుకు కాంగ్రెస్ ఎందుకు లింకు పెడుతోందని ప్రశ్నించారు.

అలాగే రామమందిరం విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనలను 2019 లోక్‌సభ ఎన్నికల తరువాత వాయిదా వేయాలని కాంగ్రెస్ తరుపున కోర్టుకు హాజరైన కపిల్ సిబల్ పైనా ప్రధాని విమర్శలు గుప్పించారు.

కిపిల్ సిబల్ రామ మందిరం తరుపున వాదిస్తున్నారా ? లేకపోతే బాబ్రీ మసీదు తరుపున వాదిస్తున్నారా ? అనేది అర్థం కాకుండా వుంది. 2019 ఎన్నికలకు, కోర్టు వాదనలకు ఎందుకు లంకె పెడుతున్నారో కాంగ్రెస్ ఇంతవరకు చెప్పలేదు ’ అన్నారు.

తనపై ‘ నీచ్ ’ వ్యాఖ్యలు చేసిన మణిశంకర్ అయ్యర్‌ను కూడా ప్రస్తావించారు. తనలాగే మీరు కూడా ఇలా అవమానానికి గురైతే ఏం చేస్తారని ప్రజలను ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.