అమెరికాలోనూ టీడీపీ అధికారంలోకి వస్తుంది.. మంత్రి లోకేష్ - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలోనూ టీడీపీ అధికారంలోకి వస్తుంది.. మంత్రి లోకేష్

February 5, 2018

అమెరికాలోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్. అమెరికా పర్యటనకు వెళ్ళిన నారా లోకేష్ న్యూజెర్సీలో జరిగిన ఎన్నారైల  సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పై వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో కార్యకర్తల ఉత్సాహాన్ని చూసి ‘ మీ జోష్ చూస్తుంటే అమెరికాలో కూడా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం అనిపిస్తోంది ’ అంటూ తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు లోకేష్.మంత్రి అమెరికా పర్యటన వివరాలను ఆయన కార్యాలయం ఆదివారం మీడియాకు తెలిపింది. ‘ ఎన్నారైలు ఆంధ్ర ప్రదేశ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రచారం చెయ్యాలని, ఎన్నారైల తలసరి ఆదాయం కూడా పెంచాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ’ లోకేష్ అభిప్రాయ పడ్డారు.