వరంగల్ బావిలో అడవి‌దున్న.. పైకి తెచ్చేేశారు.. - MicTv.in - Telugu News
mictv telugu

వరంగల్ బావిలో అడవి‌దున్న.. పైకి తెచ్చేేశారు..

February 23, 2018

ఏటూరునాగారం, పాకాల రిజర్వు అటవీ ప్రాంతంలో మాత్రమే ప్రత్యేకంగా కనిపించే అడవిదున్న పాపం బావిలో పడింది. రాత్రంతా బావిలోనే వుండిపోయింది. తెల్లారాక పొలాల్లోకి వెళ్ళిన రైతులకు బావిలోంచి దాని అరుపులు వినబడ్డాయి. దగ్గరికి వెళ్లి చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పెంచికల్ పేట సమీపంలో జరిగింది ఈ ఘటన.
‘దాహం కోసం వ్యవసాయ బావిలోకి దూకిందా..? లేకపోతే ప్రమాదవశాత్తు పడిందా?’ అని అటవీశాఖ రెస్క్యూ టీమ్‌లు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో ముగ్గురు మనుషులు బావిలోకి దిగి దానికి తాళ్ళు కట్టి, చాలా సేపు శ్రమించి దున్నను పైకి లాగారు. దున్నకు కొన్ని గాయాలైనట్టు డాక్టర్లు గుర్తించారు. తగిన వైద్యం అదించి దున్నను హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌కు తరలించారు.