బాయ్‌ఫ్రెండ్‌ను చంపి డ్రమ్ములో దాచిన హిజ్రా - MicTv.in - Telugu News
mictv telugu

బాయ్‌ఫ్రెండ్‌ను చంపి డ్రమ్ములో దాచిన హిజ్రా

January 8, 2019

ఓ హిజ్రా దారుణానికి పాల్పడింది. బాయ్ ఫ్రెండ్‌ని అతి కిరాతకంగా చంపి.. అతని మృతదేహాన్ని డ్రమ్ములో దాచి పరారయ్యింది. ఈ ఘోర సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాటమ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…సాఢ్గావ్ నివాసి మొహమ్మద్ జాకిర్ ఇంట్లో ఆరు నెలల క్రితం చాందినీ అనే హిజ్రా అద్దెకు దిగింది. తరువాత తన బాయ్‌ఫ్రెండ్‌ను తీసుకువచ్చి అక్కడే ఉండడం మొదలుపెట్టింది. 20 రోజుల క్రితం చాందినీ.. ఇంటికి తాళం వేసి.. ఊరు వెళ్తున్నట్లు ఇంటి ఓనర్‌కి చెప్పి వెళ్ళిపోయింది. తన బాయ్‌‌ఫ్రెండ్ వసీమ్ ఇంట్లో లేడని బయటకు వెళ్లాడని చెబుతూ యజమానికి తాళం ఇచ్చి వెళ్లిపోయింది.

Telugu News in uttar pradesh hijra kills her boyfriend and escapes

అయితే కొన్ని రోజుల తరువాత ఆ ఇంటిలో నుంచి దుర్వాసన వస్తుండడం గమనించిన జాకిర్ అనే వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. వారు ఘటనాస్థలంలో పరిశీలించగా 100 లీటర్ల డ్రమ్ములో యువకుని మృతదేహం కనిపించింది. అది వసీమ్ మృత దేహమని ఇంటి యజమాని గుర్తించాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని పోస్టుమార్టం కోసం తరలించి, పరారైన హిజ్రా కోసం గాలింపు చేపట్టారు.Telugu News in uttar pradesh hijra kills her boyfriend and escapes