కేజ్రీవాల్‌కు షాకిచ్చిన ఐటీ శాఖ - MicTv.in - Telugu News
mictv telugu

కేజ్రీవాల్‌కు షాకిచ్చిన ఐటీ శాఖ

November 27, 2017

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్  కేజ్రీవాల్‌కు రూ.30.67 పన్నుకు  సంబంధించిన కేసులో ఆదాయ పన్ను శాఖ నోటీసులను పంపించింది. అలాగే రూ.13 కోట్ల ఆదాయం ఎలా వచ్చిందో కూడా ఆప్  చెప్పనందున కేజ్రీవాల్‌కు ఈ నోటీసులు ఇచ్చినట్టు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

 ‘ఆమ్ ఆద్మీ’ పార్టీ విదేశాల నుంచి విరాళాల్ని సేకరించింది. ఎవరెవరు ఎంత విరాళాలు ఇచ్చారో తెలపాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ  గతంలో ‘ఆప్’ను ఆదేశించింది.  ఆమ్ ఆద్మీకీ మొత్తం రూ.68.44 కోట్ల విరాళాలు రాగా.. అందులో 462 దాతలకు చెందిన వివరాలను రికార్డులో చూపెట్టలేదు. అందుకే ఆ పార్టీ అధ్యక్షుడైన కేజ్రీవాల్‌కు నోటీసులు అందించామని  ఐటీ శాఖ వెల్లడించింది.