mictv telugu

మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆదాయపు పన్ను పరిమితి పెంపు

January 15, 2019

త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మోదీ సర్కార్ పనిచేస్తున్నది. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా వరుసగా భారీ ప్రకటనలు చేస్తుంది. అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు మరో భారీ ప్రకటనకు సిద్ధం అవుతుంది.

Telugu News Income Tax Exemption Threshold May Go Up In Interim Budget .

ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు ఆదాయపు పన్ను పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంటే.. ప్రస్తుతం ఉన్న రూ.2.5 లక్షల పరిమితి రెట్టింపు అవుతుందన్నమాట. అదే జరిగితే కోట్లాదిమంది మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరట లభించినట్టే. త్వరలో ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పరాజయ పాలవడం, ప్రభుత్వంపై విశ్వాసం తగ్గుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Telugu News Income Tax Exemption Threshold May Go Up In Interim Budget: Report