ఇండిపెండెన్స్ డే స్పెషల్ ‘ఎటు పోతున్నాం’.. వీడియో మిస్ కాకండి - MicTv.in - Telugu News
mictv telugu

ఇండిపెండెన్స్ డే స్పెషల్ ‘ఎటు పోతున్నాం’.. వీడియో మిస్ కాకండి

August 15, 2018

రోడ్డు మీద ఒక జంట కనిపిస్తే తప్పుగా అర్దం చేసుకుంటున్నాం. వాళ్ళు వెళ్ళే అవసరం మనకి తెలియకపోయినా వాళ్ళ రిలేషన్‌ని నిర్ణయించేస్తున్నాం. అన్న చెల్లి వెళుతున్నా… తప్పు పట్టి తుప్పు పట్టిన మైండ్ సెట్‌తో కామెంట్ చేస్తున్నాం. మతం మత్తులో మునిగి, కులం గొడవల్లో కుళ్ళిపోయి మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాం. స్వేచ్ఛా ప్రపంచంలో నుండి దూరంగా విసిరేస్తూ విసిగిస్తూ మనిషిని మంచితనం నుండి దూరం చేస్తూ….వినాశనం చేస్తున్నాం.

‘ఒక్క క్షణం ఆగండి.. ఆలోచించండి.. మనం వేసుకున్న మతం ముసుగు తీసి చూడు మనిషి కనిపిస్తాడు..’ అనే మంచి సందేశాన్ని ఇస్తూ మీ మైక్ టీవీ ఓ మంచి ప్రయత్నం చేసింది. ‘ ఎటు పోతున్నాం ’ అంటూ ఓ చిన్న వీడియో చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం అంటే జెండాను గౌరవించడమే కాదు, సాటి మనిషిని గౌరవించడం.. సహాయపడటం, అపార్థం చేసుకోకపోవడం, అర్థం చేసుకోవడం, అక్కున చేర్చుకోవడం..,

క్రింది లింకులో మీరూ ఈ వీడియోను చూడొచ్చు.