కిల్లర్ డ్రోన్స్‌తో శత్రు స్థావరాలకు చెక్ - MicTv.in - Telugu News
mictv telugu

కిల్లర్ డ్రోన్స్‌తో శత్రు స్థావరాలకు చెక్

April 20, 2018

భారత్ త్వరలో శత్రుదేశాలకు  కిల్లర్ డ్రోన్‌తో చెక్ పెట్టనుంది. ఈ డ్రోన్  సహాయంతో పాక్ ,చైనా సరిహద్దు ప్రాంతంలో ఎదరువుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. అంతేకాకుండా టెర్రరిజం వ్యతిరేక కార్యకలాపాల్లో కిల్లర్ డ్రోన్స్ కీలపాత్ర వహించనున్నాయి.

ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్న కొన్ని దేశాలకు అన్‌మ్యాన్‌డ్‌ ఏరియల్‌ వెహికల్స్‌(యూఏవీ)లను అమ్మేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంలో  త్వరలోనే మార్పులు రానున్నాయి. ఈ నేఫథ్యంలోనే అమెరికా కీలక భాగస్వామ్యుల్లో ఒకటైన ఇండియా కూడా 22 ప్రిడేటర్‌ బి డ్రోన్లను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వీటి ద్వారా నియంత్రణ రేఖ(ఎల్‌వోసి) వెంబడి ఉగ్రస్థావరాలను నాశనం చేయొచ్చు. అంతర్జాతీయ న్యాయ చట్టాలను అనుసరించి దేశ రక్షణ నిమిత్తం కూడా ఈ డ్రోన్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.