గూగుల్‌కు రూ.136 కోట్ల జరిమానా! - MicTv.in - Telugu News
mictv telugu

గూగుల్‌కు రూ.136 కోట్ల జరిమానా!

February 8, 2018

ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌కు భారత్‌లోని ‘కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా’ రూ.136 కోట్ల జరిమానా వేసింది. గూగుల్‌కు చెందిన ఆల్ఫాబెల్‌ కంపెనీ వెబ్‌సెర్చ్‌లో, అడ్వర్టెయిజ్‌మెంట్స్‌లో పైచేయికోసం ప్రయత్నించింది.

ఆ సంస్థ అలా చేయడంవల్ల ఇతర పోటీ సంస్థలు,యూజర్లు భారీగా నష్టపోయాయని భారత్ స్పష్టం చేసింది. అందుకోసమే గూగుల్‌కు కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా(CCI) రూ.135.86 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. 60 రోజుల్లోగా గూగుల్‌ జరిమానాను చెల్లించాల్సి వుంటుందని సీసీఐ చెప్పింది