హార్లీ డేవిడ్సన్ బైక్ ధర తగ్గింది! - MicTv.in - Telugu News
mictv telugu

హార్లీ డేవిడ్సన్ బైక్ ధర తగ్గింది!

February 14, 2018

విదేశీ లగ్జరీ బైక్‌‌‌లను కొనాలనుకునే వారికి శుభవార్త. వాటిపై ప్రభుత్వం పన్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. హార్లే డేవిడ్సన్ ,ట్రయింఫ్ వంటి బైక్‌లపై ధరలు తగ్గనున్నాయి. ఇప్పటి వరకు 800సీసీ సామర్థ్యం ఉన్న బైక్‌ల‌ 60 శాతం, అంతకంటే ఎక్కువ సామర్థ్యమున్న బైక్‌లపై 75శాతం పన్ను ఉండేది. కానీ ఇప్పుడు 50శాతం కంటే  సగానికి పన్నును తగ్గించింది. ఈ విషయాన్ని  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) పేర్కొంది. అయితే ఇక్కడో చిన్న నిబంధన కూడా ఉంది. పూర్తిగా విదేశాల్లోనే అసెంబుల్ అయిన బైక్‌లకు మాత్రమే ఈ పన్ను వర్తిస్తుంది.భారత్‌లో హైఎండ్ బైక్‌లు  ఉత్పత్తి కావడం లేదు. విదేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకోవడం వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో లగ్జరీ బైక్‌లపై  ఉన్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. స్పందించిన ప్రభుత్వం తాజాగా దిగుమతి సుంకాన్ని 50 శాతానికి పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. సుంకం సగానికి సగం తగ్గిపోవడంతో బైక్ ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది.