హైదరాబాద్‌‌‌లో అమ్ముడుబోని ఇళ్లు ఎన్నంటే..? - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌‌‌లో అమ్ముడుబోని ఇళ్లు ఎన్నంటే..?

March 5, 2018

దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా ఏడు అతిపెద్ద పట్టణాల్లో 2017 నాటికి అమ్ముడుపోని నివాస భవనాలు 4.4లక్షలు ఉన్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. వాటిలో ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంలోనే అత్యధికంగా 1.5 లక్షల ఫ్లాట్లు ఉన్నాయని పేర్కొంది. ఇలా మిగిలిపోవడం వల్ల ధరలు స్థిరంగా ఉన్నాయని విశ్లేషించింది. హైదరాబాద్‌లో దాాదాపు 28 వేల ఇళ్లు, ఫ్లాట్లు అమ్ముడుకాలేదు.ఢిల్లీలో 1,50,654 యూనిట్లు అమ్ముడబోలేదు. చెన్నైలో విక్రయం కాకుండా మిగిలిపోయిన వాటిలో ఎక్కువ యూనిట్లు నిర్మాణం పూర్తి చేసుకున్నవే. కోల్‌కతాలో అతి తక్కువగా 26,000 యూనిట్లే మిగిలిపోయాయి. ఆ తర్వాత హైదరాబాద్‌ కింది నుంచి రెండో స్థానంలో ఉంది. ముంబైలో 86,000, బెంగళూరులో 70,000, పుణేలో 36,000 మిగిలిపోయాయి. రెరా, డీమోనిటైజేషన్, జీఎస్టీ వల్ల నిర్మాణ కార్యకలాపాలు మందగించడంతోపాటు డిమాండ్‌ కూడా తగ్గినట్టు జేఎల్‌ఎల్‌ పేర్కొంది. ధరలు స్థిరంగా ఉండడంతో ఈ ఏడాది ద్వితీయార్ధంలో  విక్రయాలు క్రమంగా   పెరుగుతాయని భావిస్తున్నారు.