ఆమె హత్య వెనుక ఎవరి హస్తం?నిజాలు తేలేదెప్పుడు? - MicTv.in - Telugu News
mictv telugu

ఆమె హత్య వెనుక ఎవరి హస్తం?నిజాలు తేలేదెప్పుడు?

March 12, 2018

రిపోర్టులేమో ఆమెది ఆత్మహత్య కాదని చెబుతున్నాయి. మరి ఆమెను హత్య చేసిందెవరు? ఆమె మరణం వెనుక ఎవరి హస్తం ఉంది. 4 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎందుకు ఈ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది.  కాంగ్రెస్ నేత,మాజీ కేంద్రమంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ 2014 జనవరిలో ఓ హోటల్ గదిలో అనుమానాస్పదంగా చనిపోయారు. మొదట ఆత్మహత్యే అని పోలీసులు నిర్థారించారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్టులలో ఆమెది ఆత్మ హత్య కాదు ఎవరో ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు తెలిసింది.ఆమెను ఎవరు  చంపారో ఈ కేసులో విచారణ జరుపుతున్న అధికారులకు ముందే తెలుసా? నిందితుడికి తలొగ్గే  విచారణ అధికారులు నిజాలు బయటకు చెప్పడం లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆమెకు విషమిచ్చిన కారణంగానే చనిపోయిందని పోస్టు మార్టం రిపోర్టు కూడా చెప్పింది.  ఆమె ఒంటిపై మొత్తం 15 గాయాలు బయటపడ్డాయి.

అయితే ఆమె భర్త శశి థరూర్‌తో గొడవ పడినపుడే ఈ గాయాలు అయినట్లు వాళ్ల వ్యక్తిగత సహాయకుడు నారాయణ్ సింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. మరి ఇన్ని ఆధారాలు స్పష్టంగా ఉన్నా కూడా నిందితుడిపై పోలీసులు  ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఈ కేసును క్రైం బ్రాంచ్ కు అప్పగించేందుకు ఎందుకు నిరాకరించారు. మీడియాతో సమావేశం కావాలనుకున్న ఆమె అసలు ఏం చెప్పాలనుకుంది? మీడియా ముందు నిజాలు బయటపెడుతుందనే భయంతోనే ఆమెను ప్లాన్ ప్రకారం చంపారా?  ఏది ఏమైనా ఆమె హత్య కేసులో దాగున్న నిజాలు ఇప్పటికైనా బయటకు రాాావాల్సిన అవసరం ఉంది.