చైనాకు దడ పుట్టిస్తున్న మన సబ్ మెరైన్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

చైనాకు దడ పుట్టిస్తున్న మన సబ్ మెరైన్లు..

December 2, 2017

చైనాతో సరిహద్దు గొడవ నేపథ్యంలో భారత్ తన  భద్రతను మరింత పటిష్టం చేసింది. ఏకంగా ఒకే సమయంలో ఆరు న్యూక్లియర్ సబ్ మెరైన్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని నేవీ ఛీఫ్ ఆడ్మిరల్ సునీల్ లంబా తెలిపారు. భారత్ నేవీ సామర్థ్యాన్ని ఈ సబ్ మెరైన్లు మరింత  పరిపుష్టం చేస్తాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇండో – పసిఫిక్ రీజియన్‌లో చైనా ఆధిపత్యాన్ని  భారత్ ఎదుర్కోనుందని నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా శుక్రవారం ప్రకటించారు.ఇండో – పసిఫిక్ ప్రాంతంలో ముఖ్య  పాత్ర పోషించడానికి భారత నేవీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి భారత్‌తో కలిసి అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాలు ‘ చతుర్భుజ కూటమి ’ ఏర్పాటుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సాంప్రదాయ, సంప్రదాయేతర ముప్పును ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. గత కొంత కాలంగా హిందు మహా సముద్రంలో చైనా సబ్‌మెరైన్లను మోహరిస్తోంది. ఈ  విషయంపై  భద్రతకు ముప్పు వాటిల్లనుందని, భారత నేవీ  అనుమానిస్తోంది. చైనా ఎత్తుకు పైఎత్తు వేయాలని నిర్ణయించింది భారత్ నేవీ.

ప్రస్తుతం నేవీ దగ్గర 13 పాత సబ్‌మెరైన్లు ఉన్నాయి. వీటితోపాటు ఐఎన్ఎస్ అరిహంత్ కూడా ఉంది. బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించగలిగే ఈ అణ్వస్త్ర యుద్ధనౌకను స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. రష్యా నుంచి ఐఎన్ఎస్ చక్రను లీజ్‌కు తీసుకున్నాం, అంతర్జాతీయ ఒప్పందాల కారణంగా దీని ద్వారా అణు క్షిపణులను ప్రయోగించలేమని సునీల్ లంబా పేర్కొన్నారు.