ప్రపంచకప్ షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణం.... - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచకప్ షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణం….

March 6, 2018

ప్రపంచకప్ షూటింగ్‌లో భారత షూటర్లు తమ ప్రతిభను చాటుతున్నారు. తాజాగా మరో స్వర్ణం భారత్ ఖాతాలోకి చేరింది. ఈ టోర్నీలో భాగంగా 10 మీటర్ల  ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్ 16ఏళ్ల మనుబాకర్, భారత మరో ఆటగాడు ఓం ప్రకాశ్ మితర్వాల్‌తో జతకట్టి బంగారు పతకం సాధించారు. 476.1 పాయింట్లతో మను జోడి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు.  జర్మనీ (475.2), ఫ్రాన్స్‌ (415.1) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మరో భారత జోడీ మహిమ తుర్హి అగర్వాల్‌ – రిజ్వి జోడీ 372.4 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.సోమవారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్ ఈవెంట్‌లో మనుబాకర్ రెండుసార్లు ప్రపంచకప్‌ స్వర్ణ పతక విజేత అలెగ్జాండ్రా జవాలాను వెనక్కినెట్టి పసిడి పతకాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.