mictv telugu

అడిలైడ్ వన్డే: రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

January 15, 2019

అడిలైడ్ జరుగుతున్నా రెండవ వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిడ్నీలో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన ఆసీస్ అదే వ్యూహాన్ని ఇక్కడ కూడా అమలు చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు, ఈ వన్డేలో గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని టీంఇండియా గట్టి పట్టుదలగా ఉంది. టాస్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ… ఖలీల్ అహ్మద్ స్థానంలో హైదరాబాదీ ఆటగాడు మహమ్మద్ సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్టు తెలిపాడు. అలాగే ఆసీస్‌ను తేలిగ్గా తీసుకోబోమని, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌పై పట్టు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ మాట్లాడుతూ.. వికెట్ బాగుందని పేర్కొన్నాడు. మంచి స్కోరు చేసి భారత్‌పై ఒత్తిడి పెంచుతామన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడితే సిరీస్ కోల్పోయినట్టే. అడిలైట్ వన్డేలో గెలవడం ద్వారా సిరీస్‌ను ఇక్కడే సొంతం చేసుకోవాలని ఫించ్ సేన భావిస్తోంది.

Telugu News India vs Australia Live Cricket Score 2nd ODI in Adelaide .

అయితే తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లుగా వచ్చిన అలెక్స్ కారెయ్ (18) ని మొహమ్మద్ షమీ అవుట్ చేయగా, ఆరోన్ ఫించ్ (6) ని భువనేశ్వర్ బౌల్డ్ చేసాడు. దీనితో ఆస్ట్రేలియా 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్చ్ ఉన్నారు.

భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ

ఆస్ట్రేలియా జట్టు: అరోన్ ఫించ్ (కెప్టెన్), అలెక్స్ కేరీ, ఉస్మాన్ ఖావాజా, షాన్ మార్స్, పీటర్ హ్యాండ్స్‌కోంబ్, మార్కస్ స్టోయిన్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, నాథన్ లియాన్, పీటర్ సిడెల్, రిచర్డ్‌సన్, జాసన్ బెహ్రెండార్ఫ్

Telugu News India vs Australia, Live Cricket Score, 2nd ODI in Adelaide: Bhuvneshwar & Shami Keep Things Tight Early