mictv telugu

ధోని 10000, రోహిత్ 100.. ఆసీస్‌తో తోలి వన్డే

January 12, 2019

 ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ 10,000 పరుగులు మైలురాయిని చేరుకున్నాడు. దీంతో వన్డేల్లో 10,000 పరుగులు చేసిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా ధోనీ రికార్డుల కెక్కాడు. 10000 పరుగులు సాధించేందుకు ధోనీకి 282 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి. 10 శతకాలు, 67 అర్థ శతకాలతో 50కి పైగా సగటు సాధించాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ మాత్రమే వన్డేలలో 10,000 పరుగులు చేశారు.

Telugu News India vs Australia Live Score, 1st ODI .

ఇక స్కోర్ వివరాలను గమనిస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా వికెట్ల కోల్పోయి 288 పరుగుల చేసింది. ఉస్మాన్ క్వాజా (59), పీటర్ హాండ్స్కోబ్ (73) అర్థసెంచరీలతో అలరించారు. తదనంతరం బ్యాటింగ్ చేపట్టిన టీం ఇండియా లక్ష్యం ఛేదించడంలో తడబడుతుంది. 40 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ గా రంగంలోకి దిగిన రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. రోహిత్ 110 బంతుల్లో 100 సాధించాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ధోని 51 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజలు ఉన్నారు.

Telugu News India vs Australia Live Score, 1st ODI:  Rohit Sharma leads Indian run chase after Dhoni falls