mictv telugu

న్యూజిలాండ్‌తో తొలి టీ-20 నేడే.. అరుదైన ఛాన్స్ అందుకున్న పాండ్య బ్రదర్స్

February 6, 2019

న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ గెలిచి మంచి జోష్‌లోనున్న టీం ఇండియా ఈరోజు న్యూజిలాండ్‌తో తొలి టీ-20 మ్యాచ్ ఆడనుంది. కాగా ఇటీవల మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదురుకున్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, తన సోదరుడితో కలిసి ఓ అరుదైన అవకాశం అందుకున్నాడు. నేడు జరిగే టీ-20 మ్యాచ్‌లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి, యువ ఆటగాళ్లకు స్థానం ఇచ్చి చూడాలని జట్టు యాజమాన్యం భావించింది.

Telugu News India vs New Zealand first t20 today Pandya brothers taken into the team.

దీనితో హార్దిక్ పాండ్యాతో పాటు అతడి సోదరుడు కృనాల్ పాండ్యాకు కూడా తొలి మ్యాచ్‌లో అవకాశం దక్కింది. భారత జట్టు తరపున ఇద్దరు సోదరులు ఆడటం ఇదే మొదటిసారేమీ కాదు. మొహిందర్ అమర్‌‌నాథ్-సురీందర్ అమర్‌‌నాథ్, ఇర్ఫాన్ పఠాన్-యూసఫ్ పఠాన్‌లు గతంలో ఆడగా, ఇప్పుడు వారి సరసన హార్దిక్-కృనాల్ చేరబోతున్నారు. వీరిద్దరూ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున గత మూడు సంవత్సరాలుగా కలిసే ఆడుతున్నారన్న సంగతి తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్ నేటి మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభంకానుంది.

Telugu News India vs New Zealand first t20 today Pandya brothers taken into the team