mictv telugu

దినేష్ కార్తీక్ వల్లే టీం ఇండియా ఓడిపోయింది.. హర్భజన్

February 11, 2019

ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో భారత్‌ 4 పరుగుల తేడాతో పోరాడి ఓడి సిరీస్‌ కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై నెటిజన్లు దినేష్ కార్తీక్ ను టార్గెట్ చేశారు. చివరి ఓవర్లో దినేశ్‌ కార్తీక్‌ సింగిల్‌ తీయకపోవడం వల్లే భారత్‌ ఓడిందని అభిమానులు సోషల్‌ మీడియాలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హర్భజన్‌ సింగ్ ఈ వివాదంపై స్పందించాడు. తాను కూడా దినేష్ కార్తీక్‌నే తప్పుబట్టాడు. చివరి ఓవర్లో దినేశ్‌ కార్తీక్‌ సింగిల్‌ తీయకపోవడం ముమ్మాటికే తప్పేనని హర్భజన్ అభిప్రాయపడ్డాడు.Telugu News India vs New Zealand: Harbhajan Singh has his say on Dinesh Karthik denying single to Krunal Pandyaహర్భజన్ ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ..‘దినేశ్‌ కార్తీక్‌ చేసిన చిన్న తప్పు వల్లే టీం ఇండియా ఓడిపోయింది.​ అతను సింగిల్‌ తీయకపోవడం భారత విజయవకాశాలను దెబ్బతీసింది. కార్తీక్‌కు తనపై తనకు విశ్వాసం ఉండటం మంచిదే. కానీ అదే నమ్మకాన్ని ఇతరులపై కూడా ఉంచాలి. ముఖ్యంగా వారు బాగా ఆడుతున్నప్పుడు వారికి కూడా అవకాశం ఇవ్వాలి. కృనాల్‌ అంతకు ముందు సౌతీ ఓవర్లో 18 పరుగుల రాబట్టాడు. ఆ సింగిల్‌ తీసి కృనాల్‌కు అవకాశం వస్తే పరిస్థితి మరోలా ఉండేది. ఏది ఏమైనా కార్తీక్‌ చేసిన తప్పు భారత గెలుపు అవకాశాలను దెబ్బతీసింది’ అని తెలిపాడు.