mictv telugu

చెలరేగిపోయిన హార్దిక్ పాండ్య IND VS NZ

February 3, 2019

వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్టేలో భారత్ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. 49.5 ఓవర్లలో 252 పరుగులకు భారత జట్టు ఆలౌట్ అయింది. చివర్లో హార్దిక్ పాండ్యా చెలరేగిపోయాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 45 పరుగుల సాధించి నీషమ్ బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

Telugu News India vs New Zealand Live Score, 5th ODI New Zealand bowl out India for 252 runs.

మరోవైపు అంబటి రాయడు 113 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 90 పరుగులు సాధించి టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తదనంతరం హెన్రీ బౌలింగ్‌లో మన్రోకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జాదవ్ 34, విజయ్ శంకర్ 45 పరుగులు చేసి తమ వంతు సహకారం అందించారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు ఎవరూ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. చాహల్ (0) నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో హెన్రీ 4, బౌల్ట్ 3, నీషమ్ ఒక వికెట్ పడగొట్టారు.Telugu News India vs New Zealand Live Score, 5th ODI New Zealand bowl out India for 252 runs