విశాఖ వన్డేలో భారత్ ఘన విజయం... - MicTv.in - Telugu News
mictv telugu

విశాఖ వన్డేలో భారత్ ఘన విజయం…

December 17, 2017

మూడువన్డేల సిరీస్‌ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది. మూడో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపు సాధించింది.  శ్రీలంక చేసిన 216 పరుగుల లక్ష్యాన్ని 35 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. శిఖర్‌ ధావన్‌(100 నాటౌట్; 85 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు‌), శ్రేయస్‌ అయ‍్యర్‌(65;63 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌) విజయంలో కీలక పాత్ర పోషించారు.

భారత్ ను ఒంటి చేత్తో గెలిపించిన శిఖర్ ధావన్  ఈమ్యాచ్ లో 12 సెంచరీ చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు భారత్ బౌలర్లు చాహల్ (3/46), కుల్దీప్ యాదవ్ (3/42), హార్దిక్ పాండ్య (2/49) ధాటికి.. 44.5 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌటైంది.  ఓపెనర్ ఉపుల్ తరంగ (95: 82 బంతుల్లో 12×4, 3×6) జట్టుకి మెరుపు ఇన్నింగ్స్‌తో ఆడిరా, మిడిలార్డర్‌ ఘోరంగా తడబడింది.

సమరవిక్రమ (42), మాథ్యూస్ (17), డిక్వెల్లా (8), కెప్టెన్ తిసార పెరీరా (6) కీలక సమయంలో వికెట్లు చేజార్చుకోవడంతో శ్రీలంక జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది.