వంటగ్యాస్‌పై రూ. 4.5 వాత - MicTv.in - Telugu News
mictv telugu

వంటగ్యాస్‌పై రూ. 4.5 వాత

November 1, 2017

అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గినప్పటికీ భారత్‌లో మాత్రం ఆ ప్రభావం ఏమీ  కనిపించడం లేదు. డీజిల్,పెట్రోల్ ధరలు భగ్గుమంటూనే ఉంటున్నాయి. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ ధర  రూ. 4.50  పెరిగిపోయింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 499.69కి చేరింది.  సబ్బిడీయేతర గ్యాస్ సిలిండర్ ధర రూ. 724గా నమోదైంది. దేశంలో మెుత్తం సబ్సిడీ కింద 18.11  కోట్ల వినియోగదారులు ఉండగా, సబ్సిడీయేతర  కింద 2.66 కోట్ల వినియోగదారులు ఉన్నారు. ప్రతి సంవత్సరం 12 గ్యాస్ సిలిండర్ల కంటే ఎక్కువగా వినియోగిస్తే సబ్సిడీ లభించదు. పెట్రోలియం ఫారిన్ ఎక్స్ఛేంజ్ రేట్ ను బట్టి నెలవారీగా నిర్ణయిస్తున్నారు.