భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో రికార్డు క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ధోనీ ప్రస్తుతం ఆసియాకప్ సూపర్ 4లో భాగంగా నేడు ఆఫ్గానిస్తాన్‌తో భారత్ తలపడనుంది. దీంతో ధోనీ 509వ మ్యాచ్ ఆడుతున్నాడు.
ఈ అంతర్జాతీయ మ్యాచ్‌లో ధోనీ తొలిసారిగా బంగ్లాదేశ్‌తో ఆడాడు. గత జూన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20తో 500వ (అన్ని ఫార్మాట్లలో కలిపి) మ్యాచ్ పూర్తి చేసుకున్నాడు. శ్రీలంకపై 2005లో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మిస్టర్ కూల్. 2006లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి అంతర్జాతీయ టీ20తో ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ధోనీ మొత్తం 90 టెస్టులు, 325 వన్డేలు, 93 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. ధోనీ కెప్టెన్సీలో ఐసీసీ మేజర్ టోర్నీలను భారత్ సాధించింది. భారత్ 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 ప్రపంచకప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలను కైవసం చేసుకుంది.
అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన భారత క్రికెటర్ల జాబితాలో మెదటి స్థానంలో సచిన్(664) ఉండగా ఇప్పటిరకు రెండో స్థానంతో రాహుల్ ద్రావిడ్ (504) ఉన్నాడు. కానీ ధోనీ రాహుల్‌ను వెనక్కి నెట్టాడు. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన క్రికెటర్ల జాబితాలో సచిన్ అగ్రస్థానంలో ఉండగా..
మహే జయవర్దనే, కుమార సంగక్కర, సనత్ జయసూర్య, రికీ పాంటింగ్, షాహిద్ అఫ్రిది, కల్లిస్, ఎంఎస్ ధోనీ కన్నా ముందున్నారు.