చెస్ ఆడే చేతులు ఒక్కటయ్యాయి ! - MicTv.in - Telugu News
mictv telugu

చెస్ ఆడే చేతులు ఒక్కటయ్యాయి !

March 3, 2018

అతను చెస్‌ ఆటలో భారత గ్రాండ్ మాస్టర్. ఆమె సెర్బియాకు చెందిన చెస్ క్రీడాకారిణి. ఇద్దరి చూపులు కలిసాయి. ఆ తర్వాత మనసులు కలిశాయి. ఇంకే  చెస్ ఆడిన చేతులు పెళ్లితో ఒక్కటయ్యాయి. భారత గ్రాండ్ మాస్టర్ పెంటెల హరికృష్ణ, సెర్బియాకు చెందిన చెస్ క్రీడాకారిని నడ్జాను పెళ్లాడారు. శనివారం హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో వీరి వివాహం జరిగింది.

కొన్ని సంవత్సరాల క్రితమే వీరిద్దరూ పరిచయం అయ్యి, పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కారు. వధువుకు తెలుగు రాకపోయినా భారతీయ సాంప్రదాయాలను గౌరవిస్తూ  అచ్చ తెలుగు అమ్మాయిలా హరికృష్ణను పెళ్లాడింది. విశ్వనాథన్ ఆనంద్ స్ఫూర్తితో చెస్ ఆడడం మొదలు పెట్టిన హరికృష్ణ  అతి తక్కువ కాలంలోనే చెస్ ఆటగాడిగా మంచి గుర్తింపును సంపాదించాడు.