ఇండియ‌న్ ఐడ‌ల్ చాట్ చూడండి.. శ్రీరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

ఇండియ‌న్ ఐడ‌ల్ చాట్ చూడండి.. శ్రీరెడ్డి

April 5, 2018

సినిమాల్లో అవ‌కాశాల పేరుతో అమ్మాయిలను వాడుకున్న బ‌డా బాబుల లిస్ట్ బయట పెడతానని చెప్పిన నటి శ్రీరెడ్డి ఒక్కొక్కరి పేర్లు బయటపెడుతోంది. ఈసారి ఎవరి బండారం బయట పెడుతుందా అని సోషల్ మీడియాలో కాచుకొని చూస్తున్నారు.  తాజాగా శ్రీరెడ్డి ఇండియన్ ఐడల్ సింగర్ శ్రీరామ చంద్ర బండారం బయట పెట్టింది. తన ఫేస్‌బుక్ పేజీలో శ్రీరామ చంద్రతో వాట్సాప్‌లో చాట్ చేసిన తతంగాన్ని మొత్తం స్క్రీన్ షాట్స్ తీసి బయట పెట్టింది. కొన్ని గంట‌ల క్రితం ఇండియన్ ఐడ‌ల్ విన్నర్‌, సింగ‌ర్ శ్రీరామ్ తనతో చేసిన వాట్సప్ చాట్‌తో పాటు ఆయ‌న‌తో దిగిన ప‌లు ఫోటోల‌ని లీక్ చేసింది శ్రీరెడ్డి. ఇప్పుడు ఈ వ్యవహారం నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యింది. ‘ ఇండియ‌ల్ ఐడ‌ల్ చాట్ చూడండి.. షేమ్ ఆన్ యూ శ్రీరామ్ .. నీ పేరులో శ్రీరామ్ అనే ప‌దం తొల‌గించుకో..ఈ పేరు నీకు క‌రెక్ట్ కాదు’ అంటూ అతనితో కలిసి చేసిన రొమాంటిక్ చాట్‌తో పాటు సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలను కూడా పక్కా ఆధారాలతో లీక్ చేసేసింది శ్రీరెడ్డి.  అంతేకాదు ఆమె షేర్ చేసుకున్న నాలుగు స్క్రీన్ షాట్లలో దాదాపు అన్నీ వల్గర్‌గానే ఉండటం గమనార్హం. శ్రీరెడ్డికి ‘నిక్కీ మీనజ్’ అని నిక్ నేమ్ కూడా పెట్టాడు శ్రీరామ్. పదే పదే శ్రీరామ్.. శ్రీరెడ్డి హాట్ ఫొటోలు పంపమని అడగటంతో అంతే రీతిలో హాట్ భామ కూడా స్పందించి లేదు.. కుదరదు.. కాసేపు ఆగండి అన్నట్లుగా కాసింత రెచ్చగొట్టినట్లుగానే చాట్ చేయడం గమనార్హం.

ఇదిలాఉండగా ఇప్పటికే శ్రీరెడ్డి పోస్ట్‌పై దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించడం స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం.. అంతే రీతిలో శ్రీ సైతం కౌంటర్ ఎటాక్ చేయడం జరిగింది. శ్రీరెడ్డి త‌న ఫేస్ బుక్ పేజ్, టీవీ చానెల్స్ డిబేట్స్ ద్వారా ‘కాస్టింగ్ కౌచ్’ పేరుతో త‌న‌ను వేధించిన వారి పేర్లని ఒక్కొక్కటిగా బ‌య‌ట‌పెడుతూ క‌ల‌కలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

Look at our Indian idol chat..shame on u sri ram..remove sri ram from ur name..u r not worth to have it

Posted by Sri Reddy on Wednesday, 4 April 2018