ఇండియా మ్యాప్‌లో కశ్మీర్ మాయం.. ముస్లిం వర్సిటీలో

వివాదాలకు మారుపేరైనా అలీగడ్ ముస్లిం యూనివర్సిటీ(ఎఎమ్‌యూ) మరోసారి వార్తల్లోకెక్కింది. ఉత్తరప్రదేశ్‌లోని ఈ విశ్వవిద్యాలయ విద్యార్థులు మంగళవారం భారతదేశ చిత్రపటాన్ని ఆవిష్కరించి, గోడలపై అంటించారు. ఆ మ్యాప్‌లో మనదేశంలో కశ్మీర్ లేకపోవడంతో వివాదాలకు దారితీసింది. అది తెలుసుకున్న యూనివర్సిటీ యాజమాన్యం ఆ పోస్టర్‌ను వెంటనే తొలగించింది.

Telugu News Indian Map Without Jammu Kashmir Sparks Row On Aligarh Muslim University Campus

ఇందుకు కారణమైన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ విశ్వవిద్యాలయం వివాదాల్లోకి రావడం ఇదే తొలిసారి ఏం కాదు. ‘జిస్ లాహోర్ న వేకియా’ అనే నాటక ప్రదర్శన ప్రచారం కోసం ఈ పోస్టర్లు వేశారు. బీజేపీ విద్యార్థి సంఘం నేతలు ఈ తప్పుడు మ్యాపు గురించి వర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.  గతంలో కూడా పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా చిత్రాన్ని యూనివర్సిటీలో పెట్టడంతో సంచలనం రేపింది. తాజాగా మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడటంతో చాలామంది యూనివర్సిటీ యాజమాన్యం, విద్యార్థులపై మండి పడుతున్నారు.

Telugu News Indian Map Without Jammu Kashmir Sparks Row On Aligarh Muslim University Campus