ఇంటి వద్దకే బ్యాంకు..అదే ఐపీపీ బ్యాంకు - MicTv.in - Telugu News
mictv telugu

ఇంటి వద్దకే బ్యాంకు..అదే ఐపీపీ బ్యాంకు

November 20, 2018

ఇంటర్నెట్, ఈమెయిల్, మొబైల్ సేవలు విస్తృతంగా అభివృద్ధి చెందడంతో తపాలా శాఖ కార్యకలాపాలు భారీగా తగ్గిపోయాయి. దీనితో తపాలా సంస్థ కొత్త ప్రజాకర్షక పథకాలను అమల్లోకి తెస్తోంది. వాటిలో ఒకటి బ్యాంకింగ్ సేవలు. సాంప్రదాయ బ్యాంకుల మాదిరిగా కాకుండా కొత్త తరహాలో బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది తపాలా శాఖ ఆధ్వర్యంలో మొదలైన “ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(ఐపిపి)”. ఇందులో భాగంగా ఇంటి వద్దకే బ్యాంకింగ్‌ సేవలను తీసుకువెళ్తారు. 

1 సెప్టెంబర్ 2018 న మొదలైన ఈ బ్యాంకు… డెలివరీ సిబ్బంది ద్వారా ఖాతాదారులకు ఇంటి వద్దే నగదు అందజేయడం, డిపాజిట్లు సేకరించడం వంటి పనులు పూర్తిస్థాయిలో ప్రారంభించింది. తాజాగా మొబైల్‌ యాప్‌ ద్వారా బ్యాంకింగ్‌ సేవలను మరింత సులభతరం చేసింది. ఏటీఎంలు కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. నేటి కాలానికి అనుగుణంగా వినూత్న సేవలను ప్రారంభిస్తూ ముందుకు సాగుతోంది.Telugu News Indian Postal payments bank started door delivery banking servicesఖాతాదారులు ఫోన్‌ద్వారా సమాచారం ఇస్తే తపాలా శాఖ సిబ్బంది వారింటికే నేరుగా వెళ్లి లావాదేవీలను నిర్వహిస్తారు. నగదు ఉపసంహరణ, డిపాజిట్లు చేసుకునే అవకాశం ఉంది. తపాలా శాఖ నూతన సేవలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఇది ఎంతో మేలు చేస్తుందని తపాలా శాఖ భావిస్తుంది.