భారతీయుడికి జైలు, బెత్తం దెబ్బలు.. ఏం చేశాడంటే..

 మహిళలపై లైంగిక నేరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చట్టాలను ఎంత కఠినం చేసినా కూడా కామాంధులను కట్టడి చేయడం ప్రభుత్వాల వలన కావడం లేదు. లైంగిక నేరాలకు సింగపూర్ వంటి అభివృధి చెందిన దేశాలు కూడా అతీతం కాదని ఈ వార్త చదువుతే తెలుస్తుంది. సింగపూర్‌లో పన్నెండేళ్ల మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి అకృత్యానికి పాల్పడిన భారతీయుడికి 13 ఏళ్ల జైలు, 12 కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తూ అక్కడి హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఇక్కడి మినిమార్ట్‌లో పనిచేసే ఉదయ్‌కుమార్‌ దక్షిణామూర్తి (31) అనే వ్యక్తి షాప్‌నకు వచ్చిన ఓ బాలికకు ఉచితంగా చకాలేట్స్, బొమ్మలు ఇచ్చి వశపర్చుకున్నాడు. మూడు నెలలపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి తన గర్ల్‌ఫ్రెండ్‌కు అనుమానం రావడంతో ఈ కామాంధుడి లీలలు వెలుగుచూశాయి. ఈ ఘటన 2016లో చోటుచేసుకోగా 2019 జనవరి 10న నేర నిరూపణ అయింది. జ్యూడిషియల్‌ కమిషనర్‌ పాంగ్‌ ఖాంగ్‌ తెలిపిన వివరాలు ప్రకారం…’ఉదయ్‌కుమార్‌ దక్షిణామూర్తి మినిమార్ట్‌లో పనిచేస్తుండగా.. మైనర్‌ బాలిక ఆ షాప్‌నకు వెళ్లేది. ఆమెకు డబ్బు, బొమ్మలు తినుబండారాలు ఆశ చూపి.. రోజూ తనతో పాటు షికార్లకు తీసుకెళ్లేవాడు. అలా మూడు నెలలపాటు ఆమెను లైంగికంగా మోసం చేశాడు. 2016 సెప్టెంబర్ నుంచి డిసెంబర్‌ వరకు ఆ కామాంధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Telugu News Indian sentenced to 13-year jail .

ఎవరికైనా ఈ ఇద్దరి వ్యవహారం పట్ల అనుమానం వచ్చి ప్రశ్నిస్తే ఆ మైనర్ బాలికను ‘తను నా భార్య’ అని నమ్మబలికేవాడు. ఆ బాలిక మాత్రం అతను మా అంకుల్‌ అని జవాబిచ్చేది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి దక్షిణామూర్తి బాలికను మరింతగా నమ్మించాడు. అయితే, అక్టోబర్‌లో ఓ రోజు దక్షిణామూర్తి నిజమైన ప్రేయసి ఈ ఇద్దరినీ ఓ హోటల్‌ వద్ద చూసింది. దక్షిణామూర్తి మరో అమ్మాయితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని నిశ్చయించుకుంది. ఓ రోజు దక్షిణామూర్తి మొబైల్‌ను చెక్‌ చేయగా అందులో… సదరు బాలిక నగ్న చిత్రాలు దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన హైకోర్టు దక్షిణామూర్తిని దోషిగా తేలుస్తూ కఠిన శిక్షలను విధించింది.

Telugu News Indian sentenced to 13-year jail, 12 strokes of cane in Singapore for sex with 12-year-old