క్రికెటర్ మహమ్మద్ షమీపై పోలీసు కేసు - MicTv.in - Telugu News
mictv telugu

క్రికెటర్ మహమ్మద్ షమీపై పోలీసు కేసు

March 9, 2018

భారత క్రికెటర్ మహమ్మద్ షమీపై పోలీసు కేసు నమోదైంది. అతనికి పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని భార్య హసీన్ జహాన్ బుధవారం కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శుక్రవారం షమీతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 498ఏ, 323, 307, 376, 506, 328, 34 సెక్షన్ల కింద కేసులు పెట్టారు.షమీ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ కానుకగా  ఇచ్చిన సెల్‌ ఫోన్‌ నుంచి అమ్మాయిలతో అసభ్యంగా చేసిన చాటింగ్ వివరాలను షమీ భార్య స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది.  2014లో జూన్‌ 6న షమీ- హాసీన్‌ పెళ్లి జరిగింది. 2015 జులైలో వారికి ఆడపిల్ల జన్మించింది. ‘పెళ్లయిన నెలకే షమీ వ్యవహారాల గురించి తెలిసినా ఏమీ చేయలేకపోయాను. షమీతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా నన్ను మానసికంగా, శారీరకంగా హింసించారు. రాత్రి  2-3 గంటల వరకు వేధింపులకు గురిచేసేవారు. నన్ను చంపేందుకు కూడా ప్రయత్నించారు. షమీ కొన్నిసార్లు కొట్టేవాడు’ అని పోలీసులకు చెప్పింది హాసీన్. మరోపక్క..

బీసీసీఐ కొత్తగా ప్రకటించిన కాంట్రాక్ట్‌ జాబితాలో షమీ పేరు తొలగించింది. షమీ భారత్ తరపున 30 టెస్టుల్లో, 50 వన్డేల్లో, 7 టీ20ల్లో ఆడాడు.