వేసవి టూరిస్టులకు రైల్వే బంపర్ ఆఫర్లు - MicTv.in - Telugu News
mictv telugu

వేసవి టూరిస్టులకు రైల్వే బంపర్ ఆఫర్లు

March 19, 2018

వేసవిలో విహారయాత్రలు చేసేవారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) బంపర్ ఆఫర్లు ప్రకటించింది. తక్కువ ధరలకే ఉత్తర, దక్షిణ భారత యాత్రల మూడు ప్యాకేజీలను ప్రకటించింది. మొదటి ప్యాకేజీ కింద నవజ్యోతిర్లంగ యాత్రలో భాగంగా భీమశంకర్(పుణె దగ్గర), నాగేశ్వర్(ద్వారక దగ్గర), సోమనాథ్, ఉజ్జయిని మహకాళీశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబేకేశ్వర్, ఘ్రీశ్నేశ్వర్ (ఔరంగాబాద్ దగ్గర), ఔందనాగ్నాథ్ (నాందేడ్ దగ్గర), పర్లి వైద్యనాథ్ లకు తీసుకెళ్తారు. 11 రాత్రులు, 12 పగళ్లు యాత్ర ఉంటుంది. ఏప్రిల్ 3న ప్రారంభమై 14వ తేదీతో ముగుస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం రైలు బయలుదేరుతుంది. టికెట్ ఒకరికి స్లీపర్‌క్లాస్‌కు రూ.13020 కాగా ఏసీ త్రీటైర్‌కు రూ. 15,540.రెండో ప్యాకేజీ యాత్ర.. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఏప్రిల్ 18న మధ్యాహ్నం బయలుదేరి 12 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర ఏప్రిల్ 29తో ముగుస్తుంది. ఆగ్రా, మధుర, ఢిల్లీ, హరిద్వార్, అయోధ్య, ప్రయాగ్, వారణాసి, గయ ప్రాంతాలను చూపుతారు. ఈ రైలు కాచిగూడ, కాజీపేట్, రామగుండం స్టేషన్ల మీదుగా బయలుదేరుతుంది. స్లీపర్‌క్లాస్ టికెట్ ధర ఒకరికి రూ.11,340, ఏసీ త్రీటైర్ 13,860.

మూడో ప్యాకేజీ.. దక్షిణ భారత యాత్ర కింద తిరుచ్చిరాపల్లి, రంగనాథస్వామి, తంజావూరు బృహదీశ్వర ఆలయాలు, రామేశ్వరం, మధుర మీనాక్షి, కన్యాకుమారి, త్రివేండ్రం పద్మనాభస్వామి, గురువాయుర్ శ్రీకృష్ణ ఆలయం, శ్రీపురం బంగారు ఆలయం, తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో తిప్పుతారు. సికింద్రాబాద్ నుంచి ఈ యాత్ర మే 4న ప్రారంభ‌మై మే 12న ముగుస్తుంది. స్లీపర్‌క్లాస్ టికెట్ ధర రూ.8,505, ఏసీ త్రిటైర్ రూ.10,395.