నేను రాష్ట్రపతి మేనల్లుడిని.. - MicTv.in - Telugu News
mictv telugu

నేను రాష్ట్రపతి మేనల్లుడిని..

March 19, 2018

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  మేనల్లుడిని అంటూ ఓ వ్యక్తి విజిటింగ్ కార్డులను దర్జాగా అచ్చు వేయించుకున్నాడు. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన. పంకజ్ కోవింద్ అనే వ్యక్తి తన షాపుకు వచ్చే కస్టమర్లకు రాష్ట్రపతి ఫోటో ఉన్న విజిటింగ్ కార్డులు ఇస్తున్నాడు. ఆ కార్డులో పేరు పంకజ్ కోవింద్ అని రాసి, దాని కింద రామ్‌నాథ్ కోవింద్ మేనల్లుడని అచ్చు వేయించాడు. అందులో పంకజ్ ఫొటోతోపాటు కోవింద్ ఫొటో కూడా ఉంది,  దాంతో కొందరు వ్యక్తులు..ఆ కార్డులోని నంబర్‌కు ఫోన్ చేసి ‘నిజంగా మీరు రాష్ట్రపతికి మేనల్లుడా?’ అని అడుగుతున్నారు. ఈ విషయం కాస్తా వైరల్ అయి రాష్ట్రపతి భవన్ అధికారులకు తెలిసింది. ఈ విషయంపై మీడియా కార్యదర్శి అశోక్‌ మాలిక్‌ స్పందించారు. ‘ఈ విషయాన్ని రాష్ట్రపతి ఖండించారు. రాష్ట్రపతి భవన్‌ అధికారులు అతనిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అసలు రాష్ట్రపతికి అతను ఎవరో తెలీదు’ అనిఅశోక్ మాలిక్ తెలిపారు. మరోపక్క తనకు ఫోన్‌ చేసిన వారందరికీ తాను రాష్ట్రపతి బంధువునని ఇందులో అబద్ధం చెప్పాల్సిన విషయం ఏమీ లేదని  పంకజ్ చెబుతున్నాడు.