అగ్గువ అని మురిస్తే..  గాల్లో మీరు కాదు, మీ ప్రాణాలు! - MicTv.in - Telugu News
mictv telugu

అగ్గువ అని మురిస్తే..  గాల్లో మీరు కాదు, మీ ప్రాణాలు!

March 13, 2018

అగ్గో జీతగాడు  దొర పానం తీసిండనే సామెత వినే ఉంటారు. అగ్గువ బాబు అగ్గువ  మీరు బస్సులల్ల వొయ్యే ఖర్చుతోనే విమానాల్లో ప్రయాణించవచ్చు.. కేవలం వందల్లో విమానం ప్రయాణం, హాయిగా గాల్లో తేలుతూ ప్రయాణించండి.. అని ఆఫర్లు  పెడితే ఏమిటో అనుకున్నాం కానీ ఇదన్న మాట అసలు ముచ్చట. ఇండిగో, గో ఎయిర్ సంస్థల వాళ్లు ఈ విధంగా ఎందుకు ఆఫర్లు వెట్టిన్రంటే..అవని తుపాస్ ఇంజన్లు కలిగిన విమానాలట.  ఆ విమానాలను పరిశీలించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఎ) ఈ విషయాన్ని బయట పెట్టింది. తనిఖీలతో కంగుతిన్న సంస్థలు దాదాపు 70 విమానాలను నిలిపేశాయి.

ఇండిగో, గోఎయిర్  సంస్థలకు చెందిన మొత్తం 11  విమానాలు గాల్లో ఎగరడానికి వీల్లేదు అంటూ  డీజీసీఎ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ విమానాలన్నీ ఎ320 నియో జెట్ విమానాలు. వీటిని యూరప్‌కు చెందిన ఎయిర్‌బస్ తయారు చేస్తుండగా.. వాటిలో  అమెరికాకు చెందిన ప్రాట్ అండ్ విట్నే టర్భోఫ్యాన్ ఇంజన్లను వాడుతున్నారు. అయితే ఇంజన్లు ఫెయిల్ అవుతున్నాయి. సాధారణంగా విమానాల్లో ఒక ఇంజన్  పాడైతే ఇంకో ఇంజన్‌తో సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు. ఇండిగో, గ్ఎయిర్‌ విమానాలకు తరచూ ఇంజన్ సమస్యలు వస్తున్నాయి. మరి గాల్లో ఉన్నప్పుడు ఆ రెండో ఇంజన్  కూడా ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? ప్రయాణికులతో చెలగాటాలాడుతున్న ఇండిగో సంస్థపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు డీజీసీఎ తెలిపింది.

అర్థమైందిగదా  అగ్గువకు విమాన ప్రయాణం వస్తుంది, ఎంచక్కా గాల్లో  తేలుతూ ప్రయాణించవచ్చు అని ఆఫర్లు వెట్టిన విమాన ఎక్కేరు.   ఏమన్న అటూ ఇటూ అయిందంటే గాల్లో విమానం భూమి మీదికి చేరక ముందే  మీ ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం.