విమానంలో దోమలున్నాయంటే కొట్టి దించేశారు.. - MicTv.in - Telugu News
mictv telugu

విమానంలో దోమలున్నాయంటే కొట్టి దించేశారు..

April 10, 2018

దోమలు ఎక్కడైనా ఉంటాయి. వాటిని నిర్మూలించడం సబంధిత అధికారుల పని. కానీ ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ అదేం పట్టించుకోలేదు. పైగా దోమలు ఉన్నాయని ఫిర్యాదు చేసిన ఓ ప్రయాణికుడిపై దాడి చేసి, దించేశారు.

తాను లక్నో నుంచి బెంగళూరు వెళ్లానని, ఇండిగో విమానంలో దోమలు ఎక్కువగా ఉన్నాయని ఫిర్యాదు చేస్తే కొట్టారని సురభ్ రాయ్ అనే ప్రయాణికుడు తెలిపాడు. ‘వేలు ఖర్చు చేసి ప్రయాణిస్తాం. కనీస శుభ్రత లేకపోతే ఎలా? ఫిర్యాదు చేస్తావా అని నన్ను బెదిరించారు. కట్టారు. అవమానకరంగా అసలు విమానం నుంచి బలవంతంగా దించేశారు’ అని చెప్పాడు. ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది గతంలోనూ  ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించారు.