ఈ కుర్రోడు గుడ్లు పెట్టాడు.. డాక్టర్ల ముందే..! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ కుర్రోడు గుడ్లు పెట్టాడు.. డాక్టర్ల ముందే..!

February 22, 2018

మనుషులు గుడ్లు పెడతారా? అని అడిగితే మీరెలా స్పందిస్తారు?  అదేం పిచ్చి ప్రశ్న? పాములు వగైరా గుడ్లు పెడతాయి కాని మనిషెక్కడ పెడతాడు? మీకు బుద్ధిలేదా? అని తిడతారు కదూ. కానీ మనిషి నిజంగానే గుడ్లు పెడుతున్నాడు..! అని కడుపులో గుడ్లు ఎలా తయారవుతున్నాయో ఏమోగాని గుడ్లు మాత్రం బయటికొస్తున్నాయి. ఆ గుడ్లు పూర్తిగా తెల్లగా, లేకపోతే పచ్చగా ఉన్నాయి.

ఇండోనేషియాకు చెందిన అక్మల్ అనే 14ఏళ్ల  బాలుడు 2016 నుంచి గుడ్లు పెడుతున్నాడు. అతడు ఇప్పటివరకు 20 గుడ్లు పెట్టినట్టు తండ్రి తెలిపాడు. ఇదేం జబ్బో అని వైద్యులను సంప్రందించినా ఫలితం లేకుండా పోయింది. అసలు ఇదేదో నాటకం అని వైద్యులు మొదట కొట్టిపడేశారు. అయితే వారి సమక్షంలోనే అతడు ఏకంగా ఒకటి కాదు రెండు గుడ్లు పెట్టడంతో కంగు తిని, కళ్లు తేలేశారు. అతనికి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించినా గుడ్డు రహస్యాన్ని ఛేదించలేకపోయారు.

అయితే మనిషి గుడ్డు పెట్టడం అసాధ్యమని, అతడు గుడ్లను మింగుతూ ఉండొచ్చని అనుమానిస్తున్నారు. లేకపోతే.. అతని గుదమార్గంలో(రెక్టమ్)లో ఉద్దేశపూర్వకంగా గుడ్లు పెట్టి ఉండొచ్చంటున్నారు. అయితే అక్మల్ తండ్రి మాత్రం తన కొడుకు ఇంతవరకు గుడ్డు మింగలేదని అంటున్నాడు. పైగా అతడు పెట్టే గుడ్డు పూర్తిగా పసుపు రంగు లేదా తెలుపు రంగులో  ఉంటుందని  వైద్యులు పేర్కొన్నారు.