ఇంద్రసేనుడిగా బిచ్చగాడు 

విజయ్ ఆంటోని తన సినిమాలన్నింటిని  వైవిధ్యంగా తెరకెక్కిస్తూ, విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.  అటు తమిళ, ఇటు తెలుగు‌లో మంచి విజయాలు అందుకుంటున్నాడు. ‘బిచ్చగాడు’ చిత్రంతో  తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన విజయ్ ఆంటోని. తన తాజా చిత్రం ‘ ‘ఇంద్రసేన’ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాడు.  సి. శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. ఇందులో విజయ్ ఆంటోని మాస్ అవతారంలో కనిపించాడు. ‘ఇంద్రసేన’ చిత్రంను రాధిక శరత్ కుమార్‌తో కలసి విజయ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు విజయ్ నిర్మాతగానే కాదు, సంగీత దర్శకుడిగా, ఎడిటర్ గా కూడా పని చేస్తుండడం విశేషం. మరి మీరు కూడా ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

SHARE