ఆడోళ్లను అయ్యప్ప గుళ్లోకి రానివ్వొద్దు.. సుప్రీం జడ్జి - MicTv.in - Telugu News
mictv telugu

ఆడోళ్లను అయ్యప్ప గుళ్లోకి రానివ్వొద్దు.. సుప్రీం జడ్జి

September 28, 2018

ఆడామగా వివక్షను విడనాడుతూ, దైవసన్నిధిలో అందరూ సమానమే అని సుప్రీంకోర్టు శబరిమలపై తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయ్యప్ప దేవాలయంలోకి అన్నీ వయసుల మహిళలకు ప్రవేశం వుండాల్సిందేనని కోర్టు తీర్పిచ్చింది. ఈ విషయంలో ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. బయట జనాల విషయం అటుంచితే ఈ తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోనే ఒకరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.

Why Justice Indu Malhotra, Only Woman On Bench, Dissented On Sabarimala

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును వెలువరించింది. అయితే నలుగురి మాట ఒకటైనా నా మాట ఇంకొకటి అన్నారు మహిళా జడ్జి ఇందు మల్హోత్రా. ఆమె ధర్మాసనంలోని ఆ నలుగురి న్యాయమూర్తులతో విబేధించారు. ‘సంబంధిత మతానికి సంబంధించిన వ్యక్తులు లేదా, సంఘాలు అభ్యంతర పెట్టినప్పుడు మాత్రమే కోర్టులు జోక్యం చేశాయి.. అయ్యప్ప కూడా లీగల్ ఎంటిటీ ఉన్న వ్యక్తే.

సమానత్వ హక్కుతో మతాచారాలకు పరీక్ష పెట్టకూడదు. మన దేశంలో ఎవరి మతాలనున వారు స్వేచ్ఛగా పాటించే స్వేచ్ఛ ఉంది. ఈ విషయంలో కోర్టుల జోక్యం తగదు.. మత విశ్వాసాలకు రాజ్యాంగం నిర్దేశించే సమానత్వ సూత్రాలకు మధ్య సమతూకం పాటించాలి’ అని పేర్కొన్నారు. 10 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వయసులోని  రుతుస్రావం జరిగే మహిళలను శబరిమల దేవాలయంలోకి ప్రవేశించడం సరికాదన్నారు. తన అసమ్మతి తీర్పులో ఈ విషయాన్ని పేర్కొన్నారు. కాగా ఆమె అసమ్మతిని న్యాయస్థానం తిరస్కరించింది. సంబంధిత వర్గం లేదా మతం నుంచి బాధితులు ఆశ్రయించనిదే న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది.