ఈబీసీ కోటా వెనుక మోదీ అసలు ఉద్దేశం ఇదీ - MicTv.in - Telugu News
mictv telugu

ఈబీసీ కోటా వెనుక మోదీ అసలు ఉద్దేశం ఇదీ

January 9, 2019

పార్లమెంట్ ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈబీసీ రిజర్వేషన్ విపక్షాలకు ఊపిరి తీసుకోకుండా చేశాయి. వ్యతిరేకిస్తే ఓట్లు రావనే భయం వెంటాడుతోంది. అందుకే మోదీ పెట్టిన బిల్లుకు ఒకే చెప్పాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో  బీజేపీ ప్రభుత్వాలకు ఎదురు దెబ్బలు తగిలాక పార్టీ ఆలోచన మార్చుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమికి మోదీదే బాధ్యత అని సొంత పార్టీ నాయకులే ఆయనపై విమర్శలు చేశారు.

ఇటీవల వీడీపి సర్వే ప్రకారం చూస్తే నరేంద్ర మోదీకి కేవలం ఉత్తరాదిన మాత్రం బలం ఉంది. దక్షిణాదిలో అత్తెసరు సీట్లు కూడా రావడం లేదు. అందువల్ల  ఉత్తరాదిన ఉన్న బలాన్ని కోల్పోవద్దని ఆయన బలంగా నమ్ముతున్నట్లుంది. అందుకోసం ఈబీసీల ప్రభావం ఎక్కువగా ఉత్తరాది ఓట్లను టార్గెట్ చేసుకుని మోడీ ఓ అడుగు ముందుకేశారు.  ఇది తమకు బాగా లాభిస్తుందని నమ్ముతున్నారన్నారు.

Telugu news Inside Story Of Government's 10% Quota Bill, Sneaked Into Cabinet Note

వీటితోపాటు రైతులకు పంట  పెట్టుబడి కింద ఇస్తున్న ఆర్థిక సాయంలో  ఉత్తరాది వారికే ఎక్కువ లబ్ది చేకూరే అవకాశం ఉంది.  అందుకోసమే దేశ వ్యాప్తంగా ప్రజలపై ప్రభావం చూపే అంశాలు, అందునా ఉత్తరాదిపై మరింత ప్రభావం  చూపే అంశాలను ఆయన ఎంపిక చేసుకున్నారు.

ఆ తర్వాత   ఉద్యోగ వర్గాలకు పన్నుల్లో మినహాయింపు  ఆలోచన కూడా చేస్తున్నారట. ఇవి ఉద్యోగ, మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు. ఇటీవల వచ్చిన సర్వేల్లో కూడా ఏ పార్టికీ సంపూర్ణమైన మెజార్టీ రాదని అంటున్నారు.  బీజేపీ గతంలో సాధించిన సీట్ల కంటే దారుణంగా ఆ గ్రాఫ్ పడిపోతుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. మోదీని కాదని మరో నాయకుణ్ని ప్రధాని అభ్యర్థిగా ప్రపోజ్ చేయాలని సంఘ్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మోదీ హడావిడిగా అయిన సరే దేశ వ్యాప్తంగా ప్రభావం చూపించే,  ఓట్లు రాల్చే అంశాలకే పెద్ద పీట వేస్తున్నారు. మరోవైపు పొత్తుల పేరుతో కూటమి బలంగా ముందుకొస్తోంది.  కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లు, పొత్తుల్లో భాగంగా ప్రాంతీయ మిత్రులను కలుపుకుంటే కాంగ్రెస్ పార్టీకే విజయవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.ప్రాంతీయంగా,  జాతీయస్థాయిలో కూడా తన ప్రభావం బలంగా ఉండాలని మోదీ భావిస్తున్నారు. ఈబీసీలకు పెంచిన 10 శాతం రిజర్వేషన్ అంశం గురించి కూడా ప్రధాన మంత్రితో పాటు ఒకరిద్దరు నాయకులు తప్ప మిగతావారికి తెలియనే తెలీదట.

ఈ పనిలో కూడా తన ముద్రనే ఉండాలని కోరుకుంటున్నట్లుంది. గత ఎన్నికల్లో మోదీ ప్రభావంతో పార్టీ గెలిచిందనే ప్రచారం ఉంది. ఈ ఎన్నికల్లో కూడా తన ప్రభావంతోనే అధికారంలోకి వచ్చామనే అభిప్రాయాన్ని, నమ్మకాన్ని పార్టీలో కల్పించాలని ఆయన భావిస్తున్నట్లుంది. ఈబీసీల రిజ్వేషన్లు, రైతులకు రుణమాఫీ,  రైతులకు పెట్టుబడి సాయం, మధ్య తరగతికి పన్నుల్లో రాయితీలు ఇలా మరి కొన్ని అంశాలు ఆయన తెరపైకి తెచ్చి తన ఇమేజీనీ బాగా పెంచుకోవాలని చూస్తున్నారు. ఇవన్నీ నోట్ల రద్దు కష్టాలను, జీఎస్టీ కష్టాలను, ఏదో చేస్తానని చెప్పి ఏమీ చేయలేదనే విమర్శల నుండి మోదీని గట్టెక్కిస్తాయో లేదో మరి. మోదీ ఆయన అనుచరులు మాత్రం ఇది తమకు తప్పకుండా లాభిస్తుందని అంచనాలే వేసుకుంటున్నారు.Telugu news Inside Story Of Government’s 10% Quota Bill, Sneaked Into Cabinet Note