mictv telugu

అక్క పెళ్లి కోసం.. చెల్లెలి పరుగు..

February 11, 2019

తన అక్క పెళ్లి చేయడం కోసం తండ్రి అప్పు చేయకూడదని భావించిన చెల్లెలు.. మారథాన్ పరుగు పందాల్లో పాల్గొని అక్క పెళ్లి కోసం డబ్బు సమకూరుస్తోంది. ఈ భావోద్వేగ సంఘటన మహారాష్ట్ర రాష్ట్రంలోని బుల్డనా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఆ చెల్లెలు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కూడా గెలిచింది.

Telugu news Inspirational Story Of Poonam Sonune Who Ran A Marathon To Get Money For Her Sister's Wedding.

కిందటేడాది జరిగిన దక్షిణాసియా జూనియర్ అథ్లెటిక్స్‌లో 3000 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఆ సోదరి పేరు పూనమ్ సొనునె. ఈమె ఒక సాధారణ రైతు బిడ్డ. తండ్రి ఆదాయం అంతంత మాత్రమే. అయినప్పటికీ పాఠశాలలో చదువుకునే రోజుల్లో అథ్లెటిక్స్‌లో పూనమ్ ప్రతిభను చూసి తండ్రి పోత్రహించారు. పూనమ్ ను మంచి అథ్లెట్‌ను చేయాలనే ఉద్దేశంతో నాసిక్‌లోని విజయేంద్ర సింగ్ అనే కోచ్ దగ్గరకు పంపారు. మొదట్లో అక్కడా ఇక్కడా అప్పు చేసి కుమార్తెకు డబ్బు పంపేవారు. ఆ తరవాత విజయేందర్ సింగ్ చొరవ తీసుకుని కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ ద్వారా పూనమ్‌కు సహాయం అందించారు. ఆయన శిక్షణలో పూనమ్ మంచి అథ్లెట్‌గా ఎదుగుతోంది.

అయితే ఇటీవల పూనమ్ అక్కకు ఆమె తండ్రి పెళ్లి కుదిర్చారు. పెళ్లి అయితే కుదిరింది కానీ, పెళ్లి జరిపించడానికి కావాల్సినంత డబ్బు పూనమ్ తండ్రి దగ్గర లేదు. పెళ్లి కోసం మళ్లీ అప్పు చేయాల్సిందే. కానీ, తన తండ్రి మళ్లీ అప్పు చేయకూడదని పూనమ్ భావించింది. తండ్రికి ఆర్థికంగా సాయం చేయాలని నిర్ణయించుకుంది. దీని కోసం పూణేలో జరిగిన హాఫ్ మారథాన్‌లో పాల్గొంది. ఈ మారథన్‌లో విన్నర్‌గా నిలిచి రూ.1.25 లక్షల నగదు బహుమతిని అందుకుంది. ఈ మొత్తాన్ని తన అక్క పెళ్లి కోసం తండ్రికి అందించింది. అక్క పెళ్లి కోసం డబ్బు అయితే సంపాదిస్తుంది కానీ.. పెళ్లి మాత్రం పూనమ్ చూడలేకపోతోంది. దీనికి కారణం ఈ ఏడాది దక్షిణాసియా గేమ్స్‌కు ఎంపిక కావడమే. మార్చి 9 నుంచి నేపాల్‌ రాజధాని కాఠ్మండులో సౌత్ ఏసియన్ గేమ్స్ 2019 ప్రారంభంకానున్నాయి. ఈ గేమ్స్‌లో భారత్ తరఫున పూనమ్ రంగంలోకి దిగుతోంది. కాగా, తమకు సొంత ఇల్లు లేదని.. మారథాన్లలో పాల్గొనడం ద్వారా డబ్బుఆ సంపాదించి తన కుటుంబం కోసం ఇంటిని నిర్మిస్తానని పూనమ్ చెబుతోంది.Telugu news Inspirational Story Of Poonam Sonune Who Ran A Marathon To Get Money For Her Sister’s Wedding